నేను అలా అన్నప్పుడల్లా నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు: అల్లు అరవింద్
- బన్నీవాసు అంటే నాకు చాలా ఇష్టం
- నా నమ్మకాన్ని ఆయన నిలబెట్టాడు
- అతను కూడా నా కొడుకులాంటివాడేనన్న అరవింద్
ఇటీవల ఆయన పర్యవేక్షణలో వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అల్లు అరవింద్ కి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా సక్సెస్ మీట్లో అల్లు అరవింద్ మాట్లాడుతూ, "బన్నీ వాసు అంటే నాకు చాలా ఇష్టం .. అతను నా కొడుకులాంటివాడే. ఇతనితో కలిసి నాకు నలుగురు కొడుకులు. బన్నీవాసు నా నాలుగో కొడుకు అన్నప్పుడల్లా, అతనికి కూడా ఆస్తులు రాసిస్తానేమోనని నా ముగ్గురు కొడుకులు భయపడుతుంటారు" అంటూ చమత్కరించారు.