హైదరాబాద్ నుంచి ముంబయికి బుల్లెట్ రైలు!
- డీపీఆర్ తయారీకి రూ. 7 కోట్లు
- నివేదిక తయారైన తరువాత బోర్డు రివ్యూ మీటింగ్
- పూణె మీదుగా 711 కిలోమీటర్ల ట్రాక్
ఇటువంటివే మరో 5 హై స్పీడ్ ప్రాజెక్టులను రైల్వే శాఖ అధికారులు ప్రతిపాదించగా, అందులో సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య సెమీ హై స్పీడ్ రైల్ లైన్ కు సహకరించేందుకు రష్యన్ రైల్వేస్ కు చెందిన జాయింట్ స్టాక్ కంపెనీ అంగీకరించింది. దేశంలో హై స్పీడ్ కారిడార్ల పనులను పర్యవేక్షించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
ఇక హైదరాబాద్ - ముంబై మధ్య హై స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 711 కిలోమీటర్ల మేర ఏర్పాటు కానుంది. పూణె మీదుగా సాగే రైల్వే లైన్ డీపీఆర్ తయారీకి మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. డీపీఆర్ రెడీ అయిన తరువాత దాన్ని రైల్వే బోర్టు సమీక్ష కోసం పంపాల్సివుంటుంది. అక్కడి నుంచి కేంద్రానికి వెళ్లే డీపీఆర్ కు ఆమోదం లభిస్తే, నిధుల కేటాయింపు జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 2023 నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.