వారి పేర్లను అరుంధతి రాయ్ ఉచ్చరించడం సిగ్గుచేటు: ఉమాభారతి
- అరుంధతి పేరు పలకడానికి సిగ్గుపడుతున్నా
- ఆమెది ఒక విచిత్రమైన మనస్తత్వం
- ఆమెది మహిళా వ్యతిరేక ఆలోచనాధోరణి
సీఏఏ నిరసనకారులను ఉద్దేశిస్తూ ఢిల్లీ యూనివర్శిటీలో నిన్న అరుంధతి రాయ్ మాట్లాడారు. ఎన్పీఆర్ వివరాల కోసం అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు సరైన పేర్లు కాకుండా... బిల్లా, రంగా, కుంగ్ ఫు కుట్టా వంటి పేర్లను చెప్పాలని అన్నారు. ఈ నేపథ్యంలోనే, అరుంధతిపై ఉమాభారతి విమర్శలు గుప్పించారు.