Minister: మంత్రి కన్నబాబుకు అఖిలపక్ష నేతల వినతిపత్రం

  • కాకినాడలో మంత్రి నివాసానికి ర్యాలీగా వెళ్లిన నేతలు
  • రాజధానిగా అమరావతినే ఉంచాలన్న అఖిలపక్షం
  • అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ
ఏపీ మంత్రి కన్నబాబుకు అఖిలపక్షం నేతలు వినతిపత్రం సమర్పించారు. కాకినాడలో మంత్రి నివాసానికి అఖిలపక్ష నేతలు ర్యాలీగా వెళ్లారు. రాజధానిగా అమరావతినే ఉంచాలని టీడీపీ, జనసేన, వామపక్ష నేతలు కోరారు. అంతకుముందు, మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ, అమరావతిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ తాత్కాలిక భవనాలు ఏర్పాటు చేసే వారు కాదని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే అమరావతిని రాజధాని చేశారని బాబుపై ఆరోపణలు చేశారు. అమరావతిలో ఉన్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
Minister
Kannababu
Telugudesam
Janasena

More Telugu News