జమ్మూకశ్మీర్ నుంచి 72 కేంద్ర పారామిలటరీ దళాల ఉపసంహరణ: కేంద్రం సంచలన నిర్ణయం
- ఆర్టికల్ 370 రద్దు తర్వాత కేంద్ర బలగాల మోహరింపు
- శాంతియుత పరిస్థితుల నేపథ్యంలో వెనక్కి పిలవాలని నిర్ణయం
- కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం
జమ్మూకశ్మీర్లో 370 అధికరణ రద్దు తర్వాత శాంతియుత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో 370 అధికరణను రద్దు చేసిన సమయంలో జమ్మూకశ్మీర్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలను మోహరించారు. తాజాగా, వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు.