ఆగస్ట్ 5 తరువాత తొలిసారి సమావేశమైన పీడీపీ, ఎన్సీ నేతలు!
- కశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
- అప్పటి నుంచి ప్రధాన పార్టీల నేతలు గృహ నిర్బంధంలోనే
- సమావేశమైన పార్టీల ముఖ్య నేతలు
కాగా, ఎన్సీ, పీడీపీ పార్టీల అధినేతలు ప్రస్తుతం గృహ నిర్బంధంలో ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేతలతో మాట్లాడేందుకు వీరికి ఫోన్ సౌకర్యాన్ని కల్పించారు. ఫరూక్ అబ్దుల్లాకు మొబైల్ ఫోన్ ను, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా, మెహబూబాలు ల్యాండ్ లైన్ల నుంచి ఫోన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించారు. దీంతో వీరంతా బయట ఉన్న తమ తమ పార్టీల ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతూ, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చిస్తున్నారు.