సంక్రాంతి, క్రిస్మస్.. రద్దీని తట్టుకునేందుకు 65 ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
- క్రిస్మస్, జనవరి వస్ట్, సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకేనని ప్రకటన
- ఇప్పటికే రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్ లిస్ట్!
- ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక ఛార్జీలు?
కాచిగూడ - శ్రీకాకుళం (07016), శ్రీకాకుళం- తిరుపతి (07479), తిరుపతి- కాచిగూడ (07146), విజయవాడ రాయనపాడు మీదుగా శ్రీకాకుళంకు ప్రత్యేక రైళ్లు వెళ్తాయి. కాచిగూడ- శ్రీకాకుళం మధ్య సువిధ ప్రత్యేక రైలును నడపనున్నారు. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో ఛార్జీలు కూడా ప్రత్యేకంగానే ఉండనున్నాయి. సువిధ పేరుతో వెళ్లే ప్రత్యేక రైళ్లలో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేసే అవకాశముంది.