పల్లె ప్రగతి పరిశీలన కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్: సీఎం కేసీఆర్
- పల్లె ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
- ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో బృందాలు
- అలసత్వం వహిస్తే క్షమించేదిలేదన్న కేసీఆర్
దిద్దుబాటు చర్యల కోసమే ఫ్లయింగ్ స్క్వాడ్లతో తనిఖీలు జరుపుతున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ శాఖను పటిష్టపరిచామని, ఇచ్చిన మాట ప్రకారం పల్లె ప్రగతికి ప్రతి నెల రూ.339 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. అలసత్వం వహిస్తే క్షమించేది లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఇది పరీక్షలాంటిదని స్పష్టం చేశారు.