గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పై కాసుల వర్షం!
- గూగుల్ మాతృసంస్థకు కూడా సీఈఓగా వ్యవహరిస్తున్న పిచాయ్
- ఏడాదికి రూ.14 కోట్లు జీతం
- కంపెనీ లక్ష్యాలను అందుకుంటే నజరానాగా రూ.1400 కోట్లు!
సుందర్ పై నజరానాల వెల్లువ ఇంతటితో ఆగలేదు. ఎస్ అండ్ పీ సూచికలో ఆల్ఫాబెట్ 100 మార్కును దాటిపోతే మరో రూ.640 కోట్ల విలువైన కంపెనీ స్టాక్స్ ఈ భారతీయుడి వశం కానున్నాయి. అయితే, గూగుల్ వర్గాల్లో సుందర్ పిచాయ్ పై వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనకు అంత మొత్తం చెల్లించడం దేనికని ఓ ఉన్నతోద్యోగి సంస్థ యాజమాన్యాన్ని నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం.