amaravati: తన జన్మదినం సందర్భంగా రైతులకు సీఎం జగన్ గొప్ప బహుమతి ఇచ్చారు!: ఎంపీ కేశినేని నాని

  • రాజధాని లేని రాష్ట్రం కోసం రైతులు త్యాగాలు చేశారు
  • 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారు
  • 30 కాకపోతే 300 రాజధానులు పెట్టు
  • ఇంకా కావాలంటే 3000 పెట్టు... నీది నాది ఏమి పోతుంది?
రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన సంచలన ప్రకటనపై అమరావతి రైతులు దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ రోజు జగన్ జన్మదినోత్సవం జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనపై టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

'రాజధాని లేని రాష్ట్రం కోసం ఎంతో త్యాగం చేసి, 33,000 ఎకరాలు రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన రైతులకు తన జన్మదినం సందర్భంగా గొప్ప బహుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు' అంటూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

'30 కాకపోతే 300 పెట్టు.. ఇంకా కావాలంటే 3000 పెట్టు... నీది నాది ఏమి పోతుంది ప్రజలే కదా నష్ట పోయేది' అని కేశినేని నాని విమర్శలు గుప్పించారు.
amaravati
Andhra Pradesh
Kesineni Nani

More Telugu News