Vijay Sai Reddy: 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం జగన్: విజయసాయి రెడ్డి

  • రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి
  • ఈ ఉద్దేశంతోనే మూడు రాజధానుల ప్రతిపాదన
  • విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం చారిత్రక నిర్ణయం
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలని, ఇదే తమ ప్రభుత్వ ధ్యేయమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలనే ఉద్దేశంతోనే తాము మూడు రాజధానుల ప్రతిపాదన చేశామని ఆయన తెలిపారు. విశాఖపట్నం వైసీపీ ప్రధాన కార్యాలయంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు.

విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయాలనుకోవడం  చారిత్రక నిర్ణయమని విజయసాయి రెడ్డి అన్నారు. 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో సీఎం ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటోందని చెప్పారు.
Vijay Sai Reddy
Andhra Pradesh
YSRCP

More Telugu News