Ramcharan: వన్యప్రాణుల సంరక్షణ కోసం రామ్ చరణ్ సరికొత్త అవతారం!

  • వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా రామ్ చరణ్
  • తన నివాసంలో నిధుల సేకరణ కార్యక్రమం
  • హోస్ట్ లుగా వ్యవహరించనున్న చరణ్, ఉపాసన
సెలబ్రిటీ లైఫ్ తో పాటు సామాజిక సేవను కూడా సమానంగా చూసే జోడీ రామ్ చరణ్, ఉపాసన. తాజాగా వీరిద్దరూ తమ అభిరుచులకు అనుగుణంగా నివాసాన్ని మరింత ఆధునికీకరించుకుంటున్నారు. ఈ ఇల్లు స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ తరహాలో రూపుదిద్దుకుంటోంది. అయితే, వన్యప్రాణుల సంరక్షణ కోసం రామ్ చరణ్, ఉపాసన కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ఇంటిలోనే వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కోసం ఓ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. చరణ్, ఉపాసన ఇద్దరూ హోస్ట్ లుగా నిర్వహించబోయే ఈ నిధుల సేకరణ కార్యక్రమం పేరు వైల్డెస్ట్ డ్రీమ్స్. దీనికోసం మెగాహీరో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తాడు.  దీనికి సంబంధించిన స్టిల్స్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
Ramcharan
Upasana
Tollywood
World Wild Life fund
Wildest Dreams

More Telugu News