Andhra Pradesh: అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాల వారికీ అందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష: మంత్రి ధర్మాన కృష్ణదాస్

  • గతంలో 60 ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న రాజధానిని విభజన వల్ల నష్టపోయాం
  • ఆ తప్పిదాలు పునరావృతం కాకూడదనే మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చాం
  • రాజధాని ప్రాంత రైతులు సంతోషంగా ఉన్నారు
శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు అన్ని ప్రాంతాల వారికి అభివృద్ధి ఫలాలు అందాలన్నదే సీఎం జగన్ ఆకాంక్షని మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. రాజధాని ప్రాంతాల్లోని రైతులు సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాజధాని ఒకే చోట ఉండటం వల్ల దృష్టి ఆ ప్రాంతంపైనే ఉంటుందని.. గతంలో 60 ఏళ్లు కష్టపడి రాజధానిని నిర్మించుకుని భంగపడ్డామని అన్నారు. విభజన వల్ల రాజధానిని నష్టపోయామని అన్నారు.

గత తప్పిదాలు పునరావృతం కాకూడదనే మూడు రాజధానుల ఆలోచన చేస్తున్నామని చెప్పారు. రాజధాని మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి వికేంద్రీకరణ అవుతుందన్నారు. అమరావతికి ఎలాంటి నష్టం జరగొద్దనే అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నామన్నారు.
Andhra Pradesh
Minister Dharmana Krishna das
comments on 3 cpitals concept

More Telugu News