ఐపీఎల్-2020 వేలంలో ఆసీస్ పేసర్ కమిన్స్ కు అత్యధిక ధర
- రూ.15.5 కోట్లకు పాట్ కమిన్స్ ను దక్కించుకున్న కేకేఆర్
- రూ.10.75 కోట్లకు గ్లెన్ మాక్స్ వెల్ ను సొంతం చేసుకున్న కింగ్స్ పంజాబ్
- మొత్తం 73 స్లాట్లుండగా వేలం బరిలో ఎనిమిది జట్ల యాజమాన్యాలు
కాగా, గ్లెన్ మాక్స్ వెల్ ను రూ. 10.75 కోట్లకు కింగ్స్ పంజాబ్ ఎలెవన్ దక్కించుకుంది. ఈ వేలం పాటలో మొత్తం 332 మంది ఆటగాళ్లున్నారు. కొత్తగా వినయ్ కుమార్, అశోక్ దిండా, మాథ్యూ వేడ్, జేక్ వీదర్లాండ్, రాబిన్ బిస్త్, సంజయ్ యాదవ్ వేలం జాబితాలో చోటు సంపాదించడంతో ఈ సంఖ్య 338కి చేరింది. ఇందులో 134 మంది క్యాప్ డ్ ఆటగాళ్లుండగా, 198 మంది అన్ క్యాప్ డ్ ఆటగాళ్లున్నారు.