రాజధానిగా అమరావతే కొనసాగాలి: సీపీఐ రామకృష్ణ
- రాష్ట్ర విభజన నేపథ్యంలో అదే చెప్పాం, ఇప్పుడూ అదే చెపుతున్నాం
- అమరావతి రాజధానిగా ప్రతిపక్ష నేతగా జగన్ అంగీకరించారని వ్యాఖ్య
- అభివృద్ధి వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు శాసన సభలో రాజధానిగా అమరావతి ఉంటుందని ప్రకటించగా, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆమోదించారని సీపీఐ నేత గుర్తు చేశారు. ప్రస్తుతం ఏ ప్రాంతంలో.. ఏంచేయాలన్న.. దానిపై జగన్ ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని మంత్రులందరూ కలిసి చర్చించిన తర్వాత ఏకాభిప్రాయంతో వివరాలను వెల్లడించాలన్నారు. అన్నిపక్షాలతో సమావేశం జరిపి అందరి అభిప్రాయాలను తీసుకుని అన్ని ప్రాంతాల మధ్య సామరస్య వాతావరణం కొనసాగిస్తూ.. వెనకబడ్డ ప్రాంతాల అభివృద్ధిపై చర్యలు చేపట్టాలన్నారు. తద్వారా రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసం ప్రయత్నం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.