ఎంతైనా వారిది మాట మార్చే, మడమ తిప్పే వంశం కదా: జగన్ పై లోకేశ్ సెటైర్లు

  • రాజధానిపై నాడు-నేడు జగన్ చేసిన వ్యాఖ్యల ప్రస్తావన
  • జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట
  • రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి
ఏపీ రాజధాని అమరావతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి జగన్ అని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద ఉదాహరణ లేదంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘ఎంతైనా వారిది మాట మార్చే, మడమ తిప్పే వంశం కదా..’ అంటూ జగన్ పై సెటైర్లు వేశారు.  
Go Back to Shorts
Telugudesam
Nara Lokesh
Amaravathi
Jagan

More Telugu News