మా తాత బ్రిటీష్ హయాంలో ఐపీఎస్ ఆఫీసర్: సుజనా
- ఆమధ్య టీడీపీని వీడి బీజేపీలో చేరిన సుజనా
- ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ
- తన కుటుంబం గురించి వెల్లడి
తన పూర్వీకుల స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని పెదమద్దాలి అని, తన తల్లి సుజన గారిది కంచికచర్ల వద్ద పున్నవరం గ్రామం అని సుజనా వివరించారు. తన తండ్రి జనార్దన్ నీటిపారుదల శాఖలో ఉద్యోగి అని, ఆయన రిటైరయ్యారని తెలిపారు. తమ పూర్వీకులు వ్యవసాయం చేసేవారని పేర్కొన్నారు. తన తల్లి సొంతూరు అయిన పున్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సుజనా వివరించారు. వాస్తవానికి తన అసలు పేరు సుజనా చౌదరి కాదని, తన పేరు సత్యనారాయణ చౌదరి అని వెల్లడించారు. సత్యనారాయణ చౌదరి అనేది తన తాతగారి పేరని తెలిపారు.