ఇద్దరు విద్యార్థులకు బుల్లెట్ గాయాలున్నాయన్న డాక్టర్లు.. కాల్పులే జరపలేదంటున్న ఢిల్లీ పోలీసులు!
- జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో హింస
- బుల్లెట్ గాయాలతో సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేరిన ఇద్దరు నిరసనకారులు
- వారికి తగిలినవి పెల్లెట్ గాయాలని చెప్పిన పోలీసులు
మరోవైపు, ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ఇద్దరు జామియా నిరసనకారులు బుల్లెట్ గాయాలతో ఆసుపత్రిలో చేరారని చెప్పారు. ఇద్దరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు.
దీనిపై పోలీసులు స్పందిస్తూ, నిరసనకారులపై తాము కాల్పులు జరపలేదని చెప్పారు. వారికి తగిలినవి పెల్లెట్ గాయాలని తెలిపారు. టియర్ గ్యాస్ షెల్స్ వల్ల కూడా కొందరు గాయపడ్డారని చెప్పారు.