సీఏఏపై ఆందోళనల నేపథ్యంలో.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు
- హింసాత్మక ఘటనలు జరగకుండా నివారించండి
- ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టండి
- అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు హోంమంత్రిత్వ శాఖ సూచన
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతుండగా, రెండు రోజుల క్రితం ఢిల్లీ, హైదరాబాద్‌కూ నిరసనలు పాకాయి. ఢిల్లీలో జేఎంఐ యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఈ సూచనలు చేసింది.