Hyderabad: హైదరాబాద్ లో శీతాకాల విడిదికి వస్తున్న రాష్ట్రపతి

  • రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
  • పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు
  • ఈ నెల 20 నుంచి 28 వరకు శీతాకాల విడిది
శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషి సమీక్షా సమావేశం నిర్వహించారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 20 నుంచి 28 వరకు రాష్ట్రపతి నిలయంలో కోవింద్ బస చేస్తారని చెప్పారు. ఈ నెల 23న తిరువనంతపురం పర్యటనకు వెళ్తారని, తిరిగి 26వ తేదీ సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారని అన్నారు. 27వ తేదీన రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఉంటుందని, 28వ తేదీ మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి రాష్ట్రపతి వెళ్తారని వివరించారు.
Hyderabad
President Of India
Ramnath kovind

More Telugu News