Telangana: ఈ నెల 20న తెలంగాణ ప్రభుత్వం తరఫున క్రిస్మస్ విందు

  • క్రిస్మస్ వేడుకల నిర్వహణకు రూ.33 కోట్లు కేటాయింపు
  • ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందు ఏర్పాటు
  • సమీక్షించిన తెలంగాణ మంత్రులు
రాష్ట్రంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణ నిమిత్తం రూ.33 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నెల 20న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వం తరపున క్రిస్మస్ విందు నిర్వహించనున్నారు. ఈ విందుకు సీఎం కేసీఆర్ హాజరవుతారు. ఈ సందర్భంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి ఈ కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు.

అనంతరం, మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండగను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దుస్తుల పంపిణీ, విందు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు చెప్పారు. క్రిస్మస్ విందుకు దాదాపు పది వేల మంది హాజరుకానున్నారని తెలిపారు. ఈ నెల 18న ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించనున్నట్టు చెప్పారు. 
Telangana
Hyderabad
christmas
Party

More Telugu News