ప్రధానోపాధ్యాయుడి వేధింపులు.. కిరోసిన్ పోసుకొని ఉపాధ్యాయురాలు ఆత్మహత్యాయత్నం
- నల్గొండ జిల్లా దేవరకొండ ఎంఈవో కార్యాలయం ఎదుట ఘటన
- ప్రధానోపాధ్యాయుడు మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణ
- ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు రాంభాయిగా గుర్తింపు
దేవరకొండ ప్రభుత్వ పాఠశాలలో తాను ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నానని, తనపేరు రాంభాయి అని ఆమె తెలిపింది. తాను పని చేస్తోన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.