Andhra Pradesh: జగన్ నిజస్వరూపం క్రమంగా బయటపడుతోంది: కూన రవికుమార్

  • వైసీపీ ప్రభుత్వంపై కూన విమర్శలు
  • దద్దమ్మ ప్రభుత్వం అంటూ ఆగ్రహం
  • శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన కూన
టీడీపీ నేత కూన రవికుమార్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, జగన్ నిజస్వరూపం క్రమంగా బయటపడుతోందని అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న సమయంలో జగన్ ఎప్పుడూ ప్లకార్డు పట్టుకోలేదా అని నిలదీశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే సీఎం వెకిలి నవ్వులతో సమాధానమిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, ఇతర మంత్రుల ప్రవర్తన ప్రభుత్వ పతనానికి నాంది అని కూన రవికుమార్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో స్పీకర్ కళ్లు లేని దృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారని తమ్మినేని సీతారాంపైనా విమర్శలు చేశారు. స్పీకర్ ఒక పక్షానికే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను అడ్డుకునే అధికారం అసెంబ్లీ మార్షల్స్ కు ఉందా? లేదా? అనే విషయం స్పీకర్ వెల్లడించాలని కోరారు.
Andhra Pradesh
Jagan
YSRCP
Telugudesam
Kuna Ravikumar

More Telugu News