Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై వీర సావర్కార్ మనవడు రంజిత్ ఫైర్

  • స్వాతంత్ర్య సమర యోధులను కించపరిచేలా రాహుల్ వ్యాఖ్యలు ఉన్నాయి
  • రాహుల్ పై పరువునష్టం దావా వేస్తాం
  • మహారాష్ట్ర సీఎం ను కలుస్తానన్న రంజిత్
రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు స్వాత్రంత్య సమరయోథుడు వీర సావర్కార్ పేరును అవమానపరిచే రీతిలో ఉన్నాయంటూ విమర్శలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీర సావర్కార్ మనవడు రంజిత్ సావర్కార్ స్పందించారు. ముంబైలో ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. స్వాతంత్ర సమర యోథులను గౌరవించడం రాహుల్ నేర్చుకోవాలని హితవు పలికారు.

ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తామని, రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించాలని కోరతామని చెప్పారు. శివసేన హిందూత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్ తో పొత్తుకు స్వస్తి పలకాలని కోరారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు మహారాష్ట్ర మంత్రి వర్గం నుంచి ‘కాంగ్రెస్’ మంత్రులను తొలగించాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi
congress
Veera sawarker

More Telugu News