abdullapur net: అబ్దుల్లాపూర్ మెట్ లో కలకలం.. మహిళ పుర్రె, శరీర భాగాలు లభ్యం

  • ఇంటి నిర్మాణం కోసం ఇసుక తెప్పించిన వ్యక్తి
  • అందులో పుర్రె, శరీర భాగాలు
  • మృతురాలి వయసు 25 నుంచి 30 మధ్య ఉంటుందని పోలీసుల అంచనా
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ పుర్రె, శరీర భాగాలు కనపడ్డాయి. ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి ఇసుకను కొనుగోలు చేశాడు. అనంతరం లారీలోని ఇసుకను తన ఇంటి వద్ద వేస్తుండగా అందులో మహిళా పుర్రె, శరీర భాగాలు బయటపడ్డాయి.

ఈ ఘటనపై స్థానిక  పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు... క్లూస్ టీమ్‌తో వచ్చి తనిఖీలు చేశారు. పుర్రె, ఇతర శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి వయసు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు.  కాగా, మహుబూబ్ నగర్ జిల్లా నుంచి 8 నెలల క్రితం ఇసుక డంప్ చేసినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
abdullapur net
Hyderabad
Ranga Reddy District
Cricket

More Telugu News