Vijay Sai Reddy: ఏపీ రాజధాని అంశంపై సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారు: విజయసాయి రెడ్డి ప్రకటన

  • ఏపీని తిరోగమనం పట్టించే విధంగా చంద్రబాబు ప్రయత్నాలు 
  • ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు పరిశీలిస్తాం
  • నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం ఉంటుంది
గతంలో సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీలో చేసిన అభివృద్ధి శూన్యమని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్.. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, దీన్ని చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు.

తమ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా ప్రజల్లో అసత్య ప్రచారం చేసున్నారని, తనకు చాలా అనుభవం ఉందని చెప్పుకునే వ్యక్తే ఏపీని తిరోగమనం పట్టించే విధంగా ప్రయత్నాలు జరుపుతున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఏపీ రాజధాని అంశంపై నిపుణుల కమిటీ సిఫార్సులు, నివేదికల ఆధారంగా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకుంటారని ఆయన మీడియాకు తెలిపారు.
Vijay Sai Reddy
Andhra Pradesh
Chandrababu

More Telugu News