Bandaru Appalanayudu: బండారు అప్పలనాయుడు పారిపోగా... పోలీస్ ఆఫీసర్ కుమారుడు మౌర్య దొరికిపోయాడు!

  • ఈ తెల్లవారుజామున వైజాగ్ లో ప్రమాదం
  • మందు కొట్టి కారు నడిపిన అప్పలనాయుడు
  • పరారీలో ఉన్న అప్పలనాయుడిని పట్టుకుంటామంటున్న పోలీసులు
ఈ తెల్లవారుజామున విశాఖపట్నం బీచ్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చేసి, ఓ ద్విచక్ర వాహన దారుడిని ఆసుపత్రి పాలు చేసిన ఏపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కుమారుడు అప్పలనాయుడి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో అదే కారులో ప్రయాణిస్తున్న పోలీసు అధికారి కుమారుడు మౌర్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, సాధ్యమైనంత త్వరలో అప్పలనాయుడిని అరెస్ట్ చేస్తామని పోలీసులు వెల్లడించారు.

ఈ ఉదయం మద్యం తాగి అప్పలనాయుడు కారు నడిపిస్తుండగా, అది అదుపుతప్పి ఓ బైకర్ ను ఢీకొట్టి, ఆపై డివైడర్ ఎక్కి, పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. మౌర్యను అరెస్ట్ చేసిన పోలీసులు, అసలు రాత్రి ఏం జరిగిందన్న విషయమై ప్రస్తుతం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 
Bandaru Appalanayudu
Mourya
Vizag
Accident

More Telugu News