Australia: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ టెస్టులో... బంతి తగిలి విలవిల్లాడిన అంపైర్ అలీమ్... వీడియో!

  • ఇప్పటికే పలువురు ఆటగాళ్లకు గాయాలు
  • నొప్పితో విలవిల్లాడిన అంపైర్ అలీమ్
  • ఫిజియో చికిత్స తరువాత అంపైరింగ్ కొనసాగింపు
పెర్త్ వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టులో ఇప్పటివరకూ ఆటగాళ్లు మాత్రమే గాయాల బారిన పడగా, ఇప్పుడు అంపైర్ అలీమ్ కూడా గాయపడ్డారు. తొలి రోజున లాకీ ఫెర్గూసన్, రెండో రోజు హేజిల్ వుడ్ గాయపడి గాయాలపాలు కాగా, మూడో రోజున అంపైర్ గా విధుల్లో ఉన్న అలీమ్ కు గాయమైంది. దీంతో ఆయన నొప్పితో విలవిల్లాడుతూ కుప్పకూలారు.

న్యూజిలాండ్ పేస్ బౌలర్ టిమ్ సౌథీ బంతిని వేయగా, ఆసీస్ ఆటగాడు లబూషేన్ దాన్ని డిఫెన్స్ ఆడాడు. ఇదే సమయంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బర్న్ సింగిల్ కోసం ట్రై చేయగా, బౌలర్ సౌధీ బంతిని అందుకుని త్రో వేశాడు. ఈ క్రమంలో బంతిని పట్టుకునే క్రమంలో మరో ఆటగాడు శాంట్ నర్ ఫీల్డ్ అంపైర్ అలీమ్ ను బలంగా ఢీకొన్నాడు. దీంతో అతని మోకాలికి గాయమైంది.

నొప్పితో అలీమ్ కింద పడిపోగా, ఫిజియో అతనికి చికిత్స చేయాల్సి వచ్చింది. ఆపై గాయం కారణంగా ఏర్పడిన నొప్పిని భరిస్తూ, అతను అంపైరింగ్ చేశాడు. ఇప్పటివరకూ ఆన్ ఫీల్డ్ అంపైర్ గా 129 మ్యాచ్ లలో బాధ్యతలు నిర్వర్తించిన అలీమ్, మైదానాన్ని వీడి బయటకు వచ్చే సమయంలో వీక్షకులు చప్పట్లతో ప్రశంసించారు.
Australia
New Zeland
Cricket
Test
Aleem

More Telugu News