World Famous Lover: 'వరల్డ్ ఫేమస్ లవర్'లో తన మూడో ప్రియురాలిని పరిచయం చేసిన విజయ్ దేవరకొండ!

  • నలుగురితో ప్రేమలో పడే పాత్రలో విజయ్ దేవరకొండ
  • మూడో ప్రియురాలి ఫస్ట్ లుక్ విడుదల
  • వైరల్ అవుతున్న చిత్రం
నలుగురు అమ్మాయిలతో ప్రేమలో పడే పాత్రలో 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటిస్తున్న విజయ్ దేవరకొండ, తన మూడో ప్రియురాలిని పరిచయం చేశాడు. ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్, ఇజబెల్లా లెట్చిలు విజయ్ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇజబెల్లా, ఐశ్వర్యా రాజేశ్ పాత్రలను పరిచయం చేసిన చిత్ర యూనిట్ నేడు కేథరిన్ పోస్టర్ ను విడుదల చేసింది.

వచ్చే సంవత్సరం ప్రేమికుల రోజున ఈ సినిమా విడుదల కానుంది. తన పాత్రను తాను పరిచయం చేసుకున్న కేథరిన్, "బొగ్గు గనిలో నా బంగారం. వరల్డ్ ఫేమస్ లవర్. ఈ లవర్స్ డే రోజున నేను ప్రేమించే యూనియన్ లీడర్ శ్రీనును కలవండి" అని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సైతం తన తాజా పోస్టర్ ను విడుదల చేస్తూ, "యూనియన్ లీడర్ శ్రీను, స్మితా మేడమ్" అని కామెంట్ పెడుతూ అదే ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా టీజర్ జనవరి 3న విడుదల కానుంది.
World Famous Lover
Vijay Devarakonda
Ketharin
First Loook

More Telugu News