budget: ఫిబ్రవరి1న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నిర్మలా సీతారామన్‌?.. కసరత్తు ప్రారంభం

  • ఆర్థికవేత్తలతో రేపటి నుంచి ఆమె సంప్రదింపులు
  • వివిధ సంఘాలు, అంకుర, డిజిటల్ రంగాల ప్రతినిధులతో చర్చలు 
  • వచ్చే నెల 25 లోపు చర్చల ప్రక్రియ ముగింపు
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ తయారీకి ముందు చేయాల్సిన ప్రక్రియను ఆమె ప్రారంభించారు. ఆర్థికవేత్తలతో రేపటి నుంచి ఆమె సంప్రదింపులు జరపనున్నారు.

వివిధ సంఘాలు, అంకుర, ఫిన్ టెక్, డిజిటల్ రంగాల ప్రతినిధులతో చర్చించి నిర్మలా సీతారామన్ సూచనలు, సలహాలు తీసుకుంటారు. రేపు సాయంత్రం ఫైనాన్సియల్ రంగం, కాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. సూచనలు, సలహాలు తీసుకునే ప్రక్రియ అంతా వచ్చే నెల 25 లోపు ముగించనున్నట్లు సమాచారం.
budget
nirmala sitharaman
BJP

More Telugu News