భక్తులతో కిటకిటలాడుతున్న ఏడుకొండలు!
- భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
- బయట కూడా వేచి చూస్తున్న భక్తులు
- కొనసాగుతున్న వారాంతపు రద్దీ
నిన్న స్వామివారిని సుమారు 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.2.90 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. వారాంతం సందర్భంగా మొదలైన రద్దీ, సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నామని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్న పానీయాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.