భక్తులతో కిటకిటలాడుతున్న ఏడుకొండలు!

  • భక్తులతో నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
  • బయట కూడా వేచి చూస్తున్న భక్తులు
  • కొనసాగుతున్న వారాంతపు రద్దీ
సప్తగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చలి వణికిస్తున్నా, స్వామిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. ఈ ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయి, నారాయణగిరి ఉద్యానవనం వరకూ క్యూలైన్ వెళ్లింది. సర్వదర్శనం నిమిత్తం ఈ ఉదయం క్యూలైన్లలోకి వెళ్లే వారికి రేపు దర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.

నిన్న స్వామివారిని సుమారు 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారని, హుండీ ద్వారా రూ.2.90 కోట్ల ఆదాయం లభించిందని తెలిపారు. వారాంతం సందర్భంగా మొదలైన రద్దీ, సోమవారం కూడా కొనసాగుతుందని భావిస్తున్నట్టు అంచనా వేస్తున్నామని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్న పానీయాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
TTD
Piligrims

More Telugu News