ఆసుపత్రి వద్ద వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న అత్యాచార బాధిత బాలిక బంధువులు, ప్రజా సంఘాలు
- బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
- దిశ చట్టం అమలు చేయాలన్న బాధిత కుటుంబ సభ్యులు
- బాధితురాలిని పరామర్శించిన ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్
అయితే, ఆసుపత్రి ఎదుట జనసేన, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. వాసిరెడ్డి పద్మ ఆసుపత్రి నుంచి బయటకు రాగానే ఆమెను బాధిత బాలిక బంధువులు, రాజకీయ, ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ఈ దారుణ ఘటనపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బాలికకు వెంటనే న్యాయం చేయాలని, దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.