పక్క రాష్ట్రంలో ఘటన జరిగితే మన రాష్ట్రంలో చట్టం తీసుకువస్తున్నాం: ఏపీ మంత్రి కన్నబాబు
- దిశ చట్టం బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
- సభలో మాట్లాడిన కన్నబాబు
- సీఎం జగన్ పై ప్రశంసలు
ప్రజలు కోరుకునే తీర్పునే సీఎం జగన్ తీసుకువస్తున్నారని, గొప్ప సంస్కరణకు శ్రీకారం చుట్టారని కన్నబాబు వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపైనా ఆయన విమర్శలు చేశారు. మహిళలు కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలన్న నేతలు ప్రతిపక్షంలో సభ్యులుగా కొనసాగుతున్నారని చురక అంటించారు.