దిశ బిల్లుకు టీడీపీ మద్దతు.. స్వాగతిస్తున్నామన్న చంద్రబాబు!
- దిశ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదం
- ఇదే ఉత్సాహం అమలులో కూడా ఉండాలి
- చట్టం మనకు చుట్టం అనుకుంటేనే సమస్యలొస్తాయన్న బాబు
అయితే, చట్టాలు చేయడంతో సరిపెట్టకుండా, సమస్యల్ని అధిగమిస్తూ వాటిని అమలు చేయడం చాలా ముఖ్యమని వైసీపీ సర్కారుకు హితవు పలికారు. దేశంలో ఈ తరహా చట్టాల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి, కేంద్రాన్ని కూడా సంప్రదించి దిశ చట్టం అమలును లోపరహితంగా మార్చాలని పిలుపునిచ్చారు. దిశ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, దోషులు ఎంత గొప్పవాళ్లయినా శిక్షలు విధించేలా ఉండాలని స్పష్టం చేశారు.