'దిశ'ను చంపిన మృగాలు దిక్కులేని కుక్క చావు చావాలని మహిళలు కోరుకున్నారు: అసెంబ్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి
- దిశ ఘటన తర్వాత కొందరు ప్రకటనలకే పరిమితమైపోయారు
- సీఎం జగన్ మాత్రం దేశానికే దిశా నిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించారు
- ఇప్పటికే ఉన్న ఎన్నో చట్టాలపై ప్రజల్లో నమ్మకం లేదు
'ఈ చట్టం మాలో ఓ నమ్మకాన్ని కలిగించింది. నిత్యం నరకాన్ని అనుభవిస్తోన్న మహిళా లోకానికి నమ్మకాన్నిచ్చింది. ఈ చట్టం వల్ల న్యాయస్థానంలో న్యాయదేవత కళ్లకు గంతలు తెరుచుకుని ఆదిపరాశక్తిగా మారి.. ఆడవాళ్లపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షిస్తుందన్న నమ్మకం కలిగింది. రాక్షసుల చేతిలో బలైపోతోన్న మహిళల్లో ఈ చట్టాన్ని నమ్మకాన్ని నింపుతుంది' అని అన్నారు.
మహిళల పట్ల జరుగుతోన్న నేరాల నిరోధం కోసం ఇప్పటికే ఉన్న ఎన్నో చట్టాలపై ప్రజల్లో నమ్మకం లేదని పుష్ప శ్రీవాణి అన్నారు. 'అందుకే దిశను చంపిన మృగాలు దిక్కులేని కుక్కచావు తక్షణమే చావాలని ఈ దేశంలోని ప్రతి మహిళా కోరుకుంది. ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను శభాష్ అని మెచ్చుకున్నారు' అని వ్యాఖ్యానించారు. పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకు జగన్ 'దిశ' చట్టం తెస్తున్నారని చెప్పారు.