Kodali Nani: రామోజీరావు దగ్గర చంద్రబాబు ఓ ఉద్యోగి: కొడాలి నాని సంచలన వ్యాఖ్య!

  • టీడీపీలోకి అడ్డంగా చొరబడిన వ్యక్తి చంద్రబాబు
  • ఆ పార్టీని సర్వనాశనం చేశారని మండిపాటు
  • నిన్న పథకం ప్రకారమే గొడవ చేశారన్న నాని
రామోజీరావు నడిపిస్తున్న ఈనాడు సంస్థలో చంద్రబాబు ఓ ఉద్యోగి అని ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలోకి అడ్డగోలుగా చొరబడి, ఆపై పార్టీని సర్వనాశనం చేసిన వ్యక్తి ఆయనని అన్నారు.

నాడు వైస్రాయ్ హోటల్ లో 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా, 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈనాడులో తప్పుడు రాతలు రాయించుకున్న వ్యక్తని నిప్పులు చెరిగారు. నిన్న కావాలనే తనకు కేటాయించిన గేటులో నుంచి రాకుండా, ఓ పథకం ప్రకారం, బయటి వ్యక్తులను వెంటేసుకుని ఎమ్మెల్యేలు వచ్చే గేటులో నుంచి వచ్చారని ఆరోపించారు. అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా ఫ్లకార్డులు, పోస్టర్‌ లను పట్టుకుని దౌర్జన్యం చేశారని అన్నారు. మార్షల్స్ పై బూతులు ప్రయోగించారని మండిపడ్డారు.

ఆపై మరో ఎమ్మెల్యే టి.ఆర్థర్‌ మాట్లాడుతూ, స్పీకర్ ఆదేశాలకు అనుగుణంగానే చీఫ్ మార్షల్ వ్యవహరించారని, అసెంబ్లీ రూల్ బుక్‌ ను ఆయన ఎక్కడా ఉల్లంఘించలేదని అన్నారు. మార్షల్స్ ను తిట్టడం, గొంతు పట్టుకొని నెట్టడం బాధాకరమని అన్నారు. చంద్రబాబుపైనా, అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ సభ్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kodali Nani
Chandrababu
Assembly
Andhra Pradesh
Marshal

More Telugu News