flight delay: విమానం ఆలస్యం.. రాత్రంతా ఇండిగో ప్రయాణికుల పడిగాపులు

  • తొమ్మిది గంటలు ఆలస్యంగా వచ్చిన లోహవిహంగం
  • సమాచారం లేకపోవడంతో తప్పని ఎదురుచూపు
  • ఏరో బ్రిడ్జిపై సేదదీరిన ప్రయాణికులు
విమాన ప్రయాణికులకు కూడా అప్పుడప్పుడు ఇక్కట్లు తప్పవనేందుకు ఉదాహరణ ఇది. నిన్న హైదరాబాద్‌ రావాల్సిన ఓ ఇండిగో విమానం తొమ్మిది గంటలు ఆలస్యంగా రావడంతో ప్రయాణికుల పాట్లు వర్ణనాతీతం. వివరాల్లోకి వెళితే... లక్నో నుంచి హైదరాబాద్‌కు నిన్న రాత్రి ఈ విమానం రావాల్సి ఉంది. విమానం ఆలస్యమని ఎటువంటి సమాచారం లేకపోవడంతో, అదే విమానంలో లక్నో వెళ్లాల్సిన ప్రయాణికులు షెడ్యూల్ ప్రకారం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు.

రాత్రంతా వేచి చూసినా విమానం రాలేదు. విమాన సిబ్బంది సరైన సమాచారం ఇవ్వక పోవడం, వేచి ఉండేందుకు మార్గం లేకపోవడంతో ఏరో బ్రిడ్జిపైనే రాత్రంతా ప్రయాణికులు వేచి ఉండాల్సి వచ్చింది. దాదాపు 9 గంటలు ఆలస్యమైనా సరైన సమాచారం లేకపోవడంతో విమాన నిర్వాహకుల తీరుపై ప్రయాణికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు.
flight delay
Indigo
Hyderabad
9 hours late

More Telugu News