హామీలు నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది: రేవంత్ రెడ్డి
- బంగారు తెలంగాణ నుంచి బాకీల తెలంగాణగా మార్చారు
- మరోసారి సంక్షేమం, అభివృద్ధిని అలక్ష్యం చేశారు
- ఆరేళ్ల పాలనలో రూ.3 లక్షల కోట్ల అప్పు పైబడింది
రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ తో కొత్త రాష్ట్రంగా ప్రయాణం మొదలు పెట్టిన తెలంగాణ ఆరేళ్లు గడిచేసరికి రూ.3 లక్షల కోట్ల అప్పుతో ఉందని విమర్శించారు. రాష్ట్రం ఇప్పుడు బంగారు తెలంగాణ కాదని, బాకీల తెలంగాణగా మారిందని పేర్కొన్నారు. రైతు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఫీజు రీయింబర్స్ మెంట్ ,ఆరోగ్య శ్రీ తదితర హామీలు నెరవేర్చలేకపోయారని, అభివృద్ధిని మరిచారని ఆయన మండిపడ్డారు.