అయోధ్యపై రివ్యూ పిటిషన్ల తిరస్కరణ.. 'నవంబర్ 9' నాటి తీర్పే ఫైనల్ అన్న సుప్రీంకోర్టు
- తీర్పును సవాల్ చేస్తూ..దాఖలైన 18 పిటిషన్ల తిరస్కరణ
- సీజే జస్టిస్ బోబ్డే ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నిర్ణయం
- పిటిషన్లపై సీజే ఛాంబర్ లో అంతర్గత విచారణ జరిపిన ధర్మాసనం
అయోధ్య వివాదంపై గత నెల 9న అప్పటి సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని రాజ్యంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణంకోసం రామ్ లల్లా కు అప్పగించాలని పేర్కొంది. మరోవైపు సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల భూమిని మసీదు నిర్మాణం కోసం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది. కాగా ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 2న తొలి పిటిషన్ దాఖలు కాగా, అనంతరం మరో 17 పిటిషన్లు దాఖలయ్యాయి.