విచారణకు మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు?: ఎన్ కౌంటర్ పై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
- ఎన్ కౌంటర్ పై కొనసాగుతోన్న వాదనలు
- పరిష్కారం తీసుకొచ్చే దర్యాప్తు కావాలన్న సుప్రీంకోర్టు
- సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నామన్న ముకుల్ రోహత్గి
ఈ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులను మీరు క్రిమినల్ కోర్టు ద్వారా విచారించాలనుకుంటే కనుక ఈ విషయంలో తాము చేసేది ఏమీ ఉండదని బోబ్డే తెలిపారు. ఈ విషయంలో పోలీసుల పక్షాన తప్పులేదని ప్రభుత్వం చెబుతుంటే కనుక, అసలు వాస్తవం ఏమిటన్నది ప్రజలకు తప్పకుండా తెలియాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో కచ్చితంగా విచారణ జరగాలని అంటూ, విచారణకు ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాదిని బోబ్డే ప్రశ్నించారు.