దిశను దహనం చేసిన ప్రదేశాన్ని ఫొటోలు తీసిన న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు
- సంచలనం సృష్టించిన దిశ ఘటన
- ఘటనకు విశేష ప్రాధాన్యం ఇచ్చిన అంతర్జాతీయ మీడియా
- చటాన్ పల్లి వచ్చిన న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయుడు
జెఫ్రీతో పాటు వచ్చిన మహిళా ఫొటోగ్రాఫర్ సంఘటన స్థలాన్ని వివిధ కోణాల్లో ఫొటోలు తీశారు. ఆ తర్వాత వారు దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. అక్కడ కొన్ని ఫొటోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జెఫ్రీ మాట్లాడుతూ, న్యూయార్క్ టైమ్స్ దక్షిణాసియా విభాగం ఢిల్లీ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోందని, దిశ ఘటన గురించి తెలుసుకుని తమ పాఠకులకు మరింత సమాచారం అందించేందుకు వచ్చామని తెలిపారు.