దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసును దర్యాప్తు చేయాలన్న సుప్రీం... నిరాకరించిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీవీ రెడ్డి!
- సుప్రీంలో దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ
- వాదనలు విన్న సుప్రీం
- మాజీ జస్టిస్ తో దర్యాప్తుకు సిద్ధం!
విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న పిమ్మట, దర్యాప్తుపై సూచనలు, సలహాలను తెలియజేయాలంటూ తెలంగాణ సర్కారుకు సుప్రీం స్పష్టం చేసింది. ఆపై విచారణను రేపటికి వాయిదా వేశారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ఇప్పటికే అనేక పిటిషన్లు దాఖలయ్యాయని, ఈ ఘటనపై తాజా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని ఎస్ఏ బోబ్డే చెప్పారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కు సంబంధించి తమ వద్ద పూర్తి సమాచారం ఉందని స్పష్టం చేశారు.