Chandrababu: ముఖ్యమంత్రి అలా...మీరు ఇలాగా?: అసెంబ్లీ చీఫ్‌ మార్షల్‌పై చంద్రబాబు ఆగ్రహం

  • ప్రధాన గేటు వద్ద వివాదం
  • ఎమ్మెల్సీ నుంచి ప్లకార్డు లాక్కోవడంపై అభ్యంతరం
  • అధికారుల్లా వ్యవహరించాలంటూ ఆగ్రహం
అసెంబ్లీలోకి ప్రవేశించే సమయంలో చీఫ్‌ మార్షల్‌ వ్యవహరించిన తీరుపై ఏపీ విపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అసెంబ్లీలో ముఖ్యమంత్రి అలా వ్యవహరిస్తుంటే...మీరిక్కడ ఇలా వ్యవహరిస్తున్నారా?’ అంటూ విరుచుకుపడ్డారు.

ఈరోజు ఉదయం అసెంబ్లీకి వచ్చే సమయంలో పలువురు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్లకార్డులు చేతపట్టుకున్నారు. అసెంబ్లీ గేటు వద్దకు రాగానే ఎమ్మెల్సీ సంధ్యారాణి నుంచి చీఫ్‌ మార్షల్‌ ప్లకార్డు లాక్కున్నారు. మిగిలిన వారి వద్ద నుంచి కూడా ప్లకార్డులు లాక్కోవాలని మార్షల్స్‌ను ఆయన ఆదేశించారు. ఈ చర్యపై చంద్రబాబు ఆగ్రహోదగ్రులయ్యారు. సీఎం జగన్‌తోపాటు అధికారుల తీరును తప్పుపట్టారు.
Chandrababu
assembly
marshals

More Telugu News