Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను: హీరోయిన్ రష్మిక

  • మహేశ్ బాబు జోడీగా రష్మిక
  • అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి 
  • జనవరి 11వ తేదీన విడుదల
మహేశ్ బాబు కథానాయకుడిగా అనిల్ రావిపూడి 'సరిలేరు నీకెవ్వరు' సినిమాను రూపొందించాడు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక నటించింది. కెరియర్ తొలినాళ్లలోనే .. చాలా తక్కువ సమయంలోనే ఆమెకి మహేశ్ తో జోడీకట్టే ఛాన్స్ లభించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మహేశ్ బాబు సరసన ఆమె ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలనే కుతూహలం అందరిలోను పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో ఇదే విషయంపై రష్మిక స్పందించింది. ''మహేశ్ బాబు సరసన నటన పరంగా .. డాన్సుల పరంగా ఎంతవరకూ సరితూగానో నాకు తెలియదు .. అది ప్రేక్షకులే చెప్పాలి. నా వరకూ నేను ఒకటికి రెండు సార్లు రిహార్సల్స్ చేసి అభిమానులను మెప్పించడానికి ప్రయత్నించాను. ఆ ప్రయత్నం ఎంతవరకూ ఫలించిందనేది చూసుకోవాలనే ఆసక్తి నాలో పెరుగుతూ పోతోంది. అందుకే రిలీజ్ డేట్ కోసం నేను కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని చెప్పుకొచ్చింది.
Mahesh Babu
Rashmika

More Telugu News