JC Pawan Reddy: పార్టీ మారే ప్రసక్తే లేదు: జేసీ పవన్ రెడ్డి

  • ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటా
  • జగన్ పాలన నచ్చడం లేదని వైసీపీ నేతలే అంటున్నారు
  • ఏపీలో మళ్లీ టీడీపీ జెండా ఎగురుతుంది
తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని... ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటానని జేసీ పవన్ రెడ్డి అన్నారు. టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే భరించేది లేదని... కేసులు పెట్టాలనుకుంటే ముందు తనపై, తన చిన్నాన్న జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెట్టాలని చెప్పారు. వైసీపీ పాలనపై జనాల్లో వ్యతిరేకత మొదలైందని... జగన్ పాలన నచ్చడం లేదని వైసీపీ నేతలే చెబుతున్నారని అన్నారు. 2022లో జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఏపీలో మళ్లీ టీడీపీ జెండా ఎగురుతుందని... చంద్రబాబు సీఎం అవుతారని జోస్యం చెప్పారు.
JC Pawan Reddy
Chandrababu
Jagan
Telugudesam
YSRCP

More Telugu News