Chandrababu: చంద్రబాబు గారూ! మీ పాంప్లేట్ పేపర్ ‘ఈనాడు’లో కూడా చూసుకోండి: సీఎం జగన్

  • రైతులు కనీస మద్దతు ధర కన్నా తక్కువకు విక్రయించొద్దు
  • రైతులకు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేయాలి
  • గురువారం నాడు పేపర్లలో ప్రకటన చేస్తాం
వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కన్నా తక్కువకు విక్రయించాల్సిన అవసరం లేదని, ఈ మేరకు అన్ని పేపర్లలో ప్రకటనలు చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, కనీస గిట్టుబాటు ధరకు రైతులు విక్రయించలేని పరిస్థితి కనుక ఉంటే, ఫలానా చోటుకు వెళ్లి అమ్ముకోండి, ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తుందని చెప్పారు.

 రైతులకు ఏదైనా సమస్య ఉంటే ఫలానా నెంబర్ కు ఫోన్ చేయాలని, వెంటనే ప్రభుత్వం స్పందిస్తుందని ఈ వివరాలన్నింటిని తెలియజేస్తూ ‘ఫుల్ పేజ్ అడ్వర్టైజ్ మెంట్ ఇస్తాం..మీ పాంప్లేట్ పేపర్ ‘ఈనాడు’లో కూడా థర్స్ డే నాడు కనిపిస్తుంది చూసుకోండి’ అంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యలు చేశారు. రైతుల పక్షపాతి ప్రభుత్వం తమదని, ‘మీ మాదిరి మోసం చేసే ప్రభుత్వం తమది కాదని’ చంద్రబాబుపై విమర్శలు చేశారు.
Chandrababu
Jagan
Assembly
Andhra Pradesh

More Telugu News