Vijay Sai Reddy: పచ్చ చొక్కాల చెరలో చిక్కి అల్లాడిన మహిళల ఉదంతాలు కోకొల్లలు: విజయసాయి రెడ్డి

  • అత్యాచారాలపై దేశమంతా అట్టుడికిపోతుంది
  • మహిళా రక్షణ గురించి అసెంబ్లీలో చర్చ జరక్కుండా అడ్డుపడ్డారు
  • చంద్రబాబు పాలనలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌ కొనసాగింది 
టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. అత్యాచారాలపై దేశమంతా అట్టుడికిపోతుంటే మహిళా రక్షణ గురించి అసెంబ్లీలో చర్చ జరక్కుండా అడ్డుపడిన చంద్రబాబు.. ఉల్లి ధరలపై కన్నీళ్లు పెట్టుకోవడంలో ఆశ్చర్యమేముందని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఐదేళ్ల పాలనలో కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌తోపాటు పచ్చ చొక్కాల చెరలో చిక్కి అల్లాడిన మహిళల ఉదంతాలు కోకొల్లలని విమర్శించారు.

'ఉల్లి ధరలు పెరగడం దేశవ్యాప్త పరిణామం. దానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారే కారణమని యజమాని, బానిసలు గగ్గోలు పెడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబజార్లలో కిలో రూ.25 చొప్పున రాయితీ ధరకు ప్రభుత్వం విక్రయిస్తోంది. హెరిటేజ్ లో వంద లాభంతో కిలో 200కు అమ్ముతున్నారు' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Andhra Pradesh

More Telugu News