Apsrtc: ఆర్టీసీ ఛార్జీలు బాదుడే... బాదుడు: జగన్ పై నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు

  • ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపై నారా లోకేశ్ నిరసన
  • నాడు ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగం వీడియో పోస్ట్
  • ‘బాదుడే బాదుడు’ అంటూ అప్పటి సర్కార్ పై జగన్ విమర్శలు
ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయంపై టీడీపీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయమై జగన్ ని విమర్శిస్తూ నారా లోకేశ్ ఓ వీడియో పోస్ట్ చేశారు. నాడు ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధినేత జగన్ ప్రసంగించడం ఈ వీడియోలో కనబడుతుంది. ‘ఈ ఐదేళ్ల కాలంలో మనం చూశాం కరెంట్ ఛార్జీలు బాదుడే బాదుడు.. ఆర్టీసీ ఛార్జీలు  బాదుడే బాదుడు..’ అంటూ జగన్ అప్పటి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ విషయాన్ని లోకేశ్ ప్రస్తావించారు.

కాగా, నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసుల్లో కిలో మీటర్ కు పది పైసలు, మిగతా బస్సుల్లో ఇరవై పైసలు పెరగనున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
Apsrtc
Fares
cm
jagan
Nara Lokesh

More Telugu News