Amit Shah: కేంద్రం ప్రతిపాదించిన పౌరసత్వ సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు

  • లోక్ సభలో బిల్లుపై చర్చ కోసం ఓటింగ్
  • అనుకూలంగా 293 ఓట్లు
  • బిల్లుతో మైనారిటీలకు న్యాయం జరుగుతుందన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
దశాబ్దాల నాటి పౌరసత్వ చట్టానికి మార్పులు, చేర్పులు చేస్తూ కేంద్రం ప్రతిపాదించిన సవరణ బిల్లుకు వైసీపీ మద్దతు తెలిపింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ, ఈ బిల్లుతో మైనారిటీలకు న్యాయం జరుగుతుందని అన్నారు. శరణార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు. కాగా, లోక్ సభలో బిల్లుపై చర్చ కోసం ఓటింగ్ నిర్వహించగా 293 మంది అనుకూలంగా ఓటేశారు. 83 మంది వ్యతిరేకిస్తూ ఓటేశారు. సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, పౌరసత్వ చట్టసవరణ బిల్లును ప్రజలు ఆమోదించారని తెలిపారు. శరణార్థులకు కూడా పౌరసత్వం కల్పించే ఉద్దేశంతోనే బిల్లు తీసుకువస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు.
Amit Shah
Lok Sabha
BJP
YSRCP
Andhra Pradesh

More Telugu News